అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సింబా. సంపత్‌నంది అందిచిన ఈ కథకు మురళీమనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సంపత్‌నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించారు. ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65శాతం మంది చనిపోతున్నారు. సిగరెట్, మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేది పాతికరెట్లు ఎక్కువ. మొక్కలు మనతోనే ఉంటాయి. మనతో పాటు పెరుగుతాయి. మన తరువాత కూడా ఉంటాయి అనే డైలాగ్స్‌తో ట్రైలర్ ఆసక్తిగా సాగింది.
పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేస్తూ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నద ని, ఈ సినిమా ప్రజల్లో మార్పు తీసుకొస్తే చాలా సంతోషమని అనసూయ చెప్పింది. ప్రకృతిని కాపాడుకొని, భవిష్యత్తు తరానికి మంచి ప్రపంచాన్ని అందించాలనే స్ఫూర్తిదాయక కథతో ఈ సినిమా తీశామని నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో అరుదుగా సినిమాలు వస్తుంటాయని సంగీత దర్శకుడు కృష్ణసౌరభ్ అన్నారు. ఆగస్ట్ 9న విడుదలకానుంది.