యువ నాయకత్వంలో సింగపూర్ మరింత పురోగతి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నా రు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఓ నమూనా అని పేర్కొన్నారు. భారత్ కూడా స్వయంగా అనేక సింగ్‌పూర్ లను సృష్టించాలనుకుంటోందన్నారు. ఇది కేవలం భాగస్వామ్య దేశం కాదని, అభివృద్ధి చెందుతోన్న దేశాలకు సింగపూర్ ఓ స్ఫూర్తి అని అభివర్ణించారు.
భారత్‌లో అనేక సింగపూర్‌లను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని సాధించేందుకు మనం సహకరించుకోవడం సంతోషంగా ఉంది. మంత్రుల స్థాయిలో నిర్వహించిన చర్యలు ఇందుకు ఓ మార్గనిర్దేశం అవుతాయి అని పేర్కొన్నారు. ఆకాంక్షించారు. నైపుణ్య శిక్షణ, డిజిటలైజేషన్, మొబిలిటీ, తయారీ, సెమీకండ క్టర్లు, ఏఐ, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సహకరించుకోవడంపై ఇరువురు చర్చించా మని పేర్కొన్నారు. సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ మే నెలలో బాధ్యతలు చేపట్టారు. రెండు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగిన లీ సీన్ లూంగ్ (72) వైదొలగడంతో డిప్యూటీ పీఎంగా ఉన్న లారెన్స్ ఆ బాధ్యత లు చేపట్టిన సంగతి తెలిసింది.