Skip to main content

Namaste NRI

సింగిల్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సింగిల్‌. కార్తీక్‌రాజు దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌ పతాకంపై విద్యా కొప్పినీడి, భానుప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మిస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగే ఎంటర్‌టైనర్‌ ఇది. శ్రీవిష్ణు పాత్ర డిఫరెంట్‌ షేడ్స్‌తో సాగుతుంది. చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. కేతికశర్మ, ఇవాన, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌చంద్రశేఖర్‌, సంభాషణలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, రచన-దర్శకత్వం: కార్తీక్‌రాజు.

Social Share Spread Message

Latest News