Namaste NRI

గ్రాండ్ గా జరిగిన సిరిమల్లె పువ్వా  ప్రీ రిలీజ్ ఈవెంట్

శ్రీకర్ కృష్ణ, శ్రావణి నిక్కి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా సిరిమల్లె పువ్వా. ఈ చిత్రాన్ని షకీరా మూవీస్ పతాకంపై కౌశర్ జహాన్ నిర్మిస్తున్నారు. గౌతమ్ మైలవరం దర్శకుడు. ఈ సినిమా రాజకీయ నేపథ్య ప్రేమకథగా రూపొందింది. ఈ నెల 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు చంద్ర మహేష్, సముద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ మంచి టైటిల్ తో వస్తున్న సిరిమల్లె పువ్వా చిన్న సినిమా అయినా కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చిత్ర దర్శక, నిర్మాతలకు మంచి పేరును తీసుకు వస్తుంది. చిత్ర దర్శకుడు గౌతమ్ గారికి సినిమా అంటే ఎంతో ఇష్టం. తను మంచి కథ రాసుకొని సినిమా తియ్యాలనే ప్యాషన్ తో తన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను నిర్మాత కౌసర్ జహాన్ చాలా చక్కగా నిర్మించారు. మంచి కథ, మంచి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

 చిత్ర నిర్మాత కౌశర్ జహాన్ మాట్లాడుతూ కుల పట్టింపులతో ఇబ్బందులు పడే ప్రేమికులను నిత్యం చూస్తున్నాం. అణగారిన వర్గానికి చెందిన ఓ అమ్మాయి, అగ్రవర్ణానికి చెందిన ఓ అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథ ఇది. నిజమైన ప్రేమకు కులం అడ్డుకాదనే సందేశంతో చిత్రాన్ని నిర్మించాం. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అందిస్తూనే ఆకట్టుకుంటుంది  అన్నారు.  హీరో శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ 2019 లో స్టార్ట్ అయిన మా మూవీ 2023 లో రిలీజ్ అవుతుంది.అంటే ఈ సినిమాకు ఎంత స్ట్రగుల్ పడ్డామో మాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా మా నిర్మాత జహాన్ గారు ఈ సినిమాను ముందుకు తీసుకు వచ్చారు. ఇలాంటి మంచి కథలో నన్ను, సెలెక్ట్ చేసుకొన్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. హీరోయిన్ నిక్కీ శ్రావణి మాట్లాడుతూ ఫిబ్రవరి 10 న విడుదల అవుతున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.  ఈ చిత్రానికి  బ్యానర్ : షకీరా మూవీస్, ప్రొడ్యూసర్ కౌసర్ జహాన్, డైలాగ్స్, రైటర్, డైరెక్టర్ : గౌతమ్ మైలవరం, ఎడిటర్ : నందమూరి తారకరామారావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సత్యానంద్ వి, మ్యూజిక్ డైరెక్టర్ : జీబు, సింగర్ : బి సౌజన్య,బి శిరీష, డాన్స్ మాస్టర్ : అనీష్,డబ్బింగ్, ఎడిటింగ్ : సూపర్ గుడ్ స్టూడియోస్ డి ఐ : డిజి పోస్ట్ స్టూడియో, పి. ఆర్. ఓ : చందు రమేష్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events