సంజయ్‌రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ఈ చిత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్. నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. ఏఆర్ శ్రీధర్ దర్శకుడు. ఈ నేపథ్యంలో నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ స్లమ్ డాగ్ హజ్బెండ్ పూర్తి వినోదాత్మక చిత్రం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా వుంటుంది. అంతర్లీనంగా ఓ సందేశం కూడా వుంటుంది అన్నారు. మాది సూర్యాపేట జిల్లా. మాకు ఊర్లో థియేటర్ కూడా వుండేది. అందుకే సినిమాల మీద ఆసక్తి వుంది. వ్యాపారరీత్యా విదేశాలకు వెళ్లాం. అక్కడ ఓ హాలీవుడ్ సినిమాను కూడా నిర్మించాం. తెలుగులో జార్జిరెడ్డి చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. స్లమ్ డాగ్ హజ్బెండ్ ను మూఢ నమ్మకాల మీద సెటైర్‌లా వుండే పూర్తి కామెడీ కథతో నిర్మించాం. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్తగా వుండటంతో పాటు వినోదాన్ని పంచుతుంది. మా సంస్థలో విభిన్న చిత్రాలు నిర్మించాలనేది మా లక్ష్యం.ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. మేము నిర్మించిన మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. మరో ఆరు ప్రాజెక్ట్‌లు కూడా చర్చల దశలో వున్నాయి. వీటి ద్వారా కూడా న్యూటాలెంట్‌ను పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తాం అన్నారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
