విజయనిర్మల గారి మనవడు శరణ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టర్ కింగ్. దీన్ని శశిధర్ చావలి తెరకెక్కిస్తున్నారు. నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలు. బి.ఎన్.రావు నిర్మాత. మణిశర్మ సంగీత మందిస్తున్నారు. ఈ సినిమాలోని మరీ ఇంత అందమేంటి సన్నీ సిన్నీ పాటను విడుదల చేశారు. ఈ పాటకు బాస్కరభట్ల సాహిత్యమందించగా.. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. యూత్‌పుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. చిత్రీకరణ పూర్తియింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, ఎఎస్ కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: తన్వీర్ అంజుమ్.














