అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నానని, పన్ను ఎగవేతకు పాల్పడ్డడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు అంగీకరించారు. దీనిపై హంటర్ బైడెన్ న్యాయశాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కోర్టులో దాఖలైన లేఖ ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. ఐదు సంవత్సరాలపాటు సాగిన ఈ కేసు విచారణ అనంతరం ఆయన తన నేరాలను అంగీకరించారు ప్రతిఏటా ఆదాయం పన్ను చెల్లించడంలో విఫలమయ్యాయనని ఒప్పుకున్నారు. అంతే కాదు చట్ట విరుద్ధంగా గన్ కొనుగోలు చేశారని అంగీకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ కేసులో హంటర్ బైడెన్‌కు రెండు కౌంట్ల శిక్ష పడాల్సి ఉంటుంది.

హంటర్ బైడెన్ తన సొంత రాష్ట్రం డెలావేర్ నుంచి యూఎస్ అటార్నీ ఆఫీసుతో ఒప్పందం చేసుకున్నారు. డ్రగ్ యూజర్ అయినా గన్ కలిగి ఉన్నట్లు అంగీకరించాడు. ఈ మేరకు హంటర్ బైడెన్ కు, యూఎస్ ప్రాసిక్యూటర్లకు మధ్య కుదిరిన ఒప్పందానికి ఫెడరల్ జడ్జి ఆమోదం తెలపాల్సి ఉంది.

