Namaste NRI

సంతాన ప్రాప్తిరస్తు నుంచి తెలుసా నీ కోసమే సాంగ్ రిలీజ్

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్‌ రెడ్డి దర్శకుడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి ప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి తెలుసా నీ కోసమే అనే పాటను అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. కొన్నేళ్లుగా సంతానలేమితో బాధపడుతున్న వారు ఎక్కువవుతున్నారని, అందుకే దేశంలో పెద్ద ఎత్తుల ఫర్టిలిటీ సెంటర్స్‌ వెలుస్తున్నాయని, ఈ పాయింట్‌ను తీసుకొని వినోదాత్మకంగా సినిమా తీశామని నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

సమాజంలో కొందరు దంపతులు ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంలో చక్కటి కామెడీ కలబోతగా ఈ చిత్రాన్ని తీశామని, కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు సంజీవ్‌ రెడ్డి తెలిపారు. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా కుటుంబ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించామని హీరో విక్రాంత్‌ తెలిపారు. వచ్చే నెల 14న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: మహిరెడ్డి పండుగుల, సంగీతం: అజయ్‌ అరసాడ, దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events