Namaste NRI

తెలంగాణ దశాబ్ది వేడుకలకు సోనియా రాక

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోనియాగాంధీ కార్యాలయం  నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందినట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.  రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరుకావాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా ఢల్లీి వెళ్లి ఆమెను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జూన్‌ 2న తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్న వేడుకలకు సోనియా హాజరుకానున్నారు. ఆమె పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ రావాల్సి ఉందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News