రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విరాటపర్వం. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1990లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా సాయి పల్లవి బర్త్ డే కానుకగా వెండితెర వెన్నెల సాయి పల్లవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ సోల్ ఆఫ్ వెన్నెల పేరుతో ఒక ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, సాయిచంద్, జరీనా వహబ్, ఈశ్వరీరావు, నందితా దాస్, నివేదా పేతురాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోసషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.














