Skip to main content

Namaste NRI

విరాటపర్వంలో సోల్‌ ఆఫ్‌ వెన్నెల

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విరాటపర్వం. డి.సురేష్‌ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1990లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా సాయి పల్లవి బర్త్‌ డే కానుకగా వెండితెర వెన్నెల సాయి పల్లవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్‌  సోల్‌ ఆఫ్‌ వెన్నెల పేరుతో ఒక ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, సాయిచంద్‌, జరీనా వహబ్‌, ఈశ్వరీరావు, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ప్రియమణి కీలక పాత్రలు పోసషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News