
ఈ భూప్రపంచంపై కనుమరుగుకానున్న తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డుల్లో నిలిచిపోనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. జనాభా సంక్షోభమే దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు. కొరియాలో జననాల రేటు చరిత్రలో ఎన్నడూ చూడనిస్థాయికి పడిపోయినట్టు గుర్తుచేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి ఆ దేశ జనాభా 66 శాతం మేర పడిపోనున్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుతం 5.2 కోట్ల మంది ఉన్న దక్షిణ కొరియా జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి 1.4 కోట్లకు పడిపోనున్నట్టు చెప్తున్నారు.
