
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే . వ్యోమగాముల్ని ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపట్టాల్సి ఉంది. కానీ స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదా పడింది. రాకెట్‌లో సాంకేతిక సమస్యతో శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు జరగాల్సిన యాక్సియం -5 మిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 10వ తేదీన జరగాల్సిన ప్రయోగం వరుసగా రెండోరోజూ వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
