Namaste NRI

ది ప్యారడైజ్ నుంచి నాని ఫెరోషియస్ అవతార్ లో స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్ రిలీజ్

నాని కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ ది ప్యారడైజ్‌. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం.  సుధాకర్‌ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పాన్‌ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పోస్టర్లకు ఆడియన్స్‌లో మంచి స్పందన లభించిందని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా బిహైండ్‌ ది సీన్స్‌తో స్పార్క్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. జైల్‌ నేపథ్యంలో సాగిన ఈ వీడియోలో, హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో 15 రోజులపాటు షూట్‌ చేసిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌కి సంబంధించిన ఎక్సైటింగ్‌ క్లిప్స్‌ కనిపించాయి.

కత్తులు పట్టుకున్న ఖైదీలు చుట్టుముట్టినప్పటికీ నాని పాత్ర ఒంటరిగా, చేతిలో ఆయుధం లేకుండా, ఏమాత్రం భయపడకుండా సీట్లో కూర్చొని ధైర్యంగా వారిని సవాలు చేస్తూ కనిపించడం ఈ గ్లింప్స్‌లో హైలైట్‌. రెండు జడలు, ముఖంపై గాట్లు, రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌తో నాని పవర్‌ఫుల్‌గా కనిపించారు. శ్రీకాంత్‌ ఓదెల బోల్డ్‌ విజన్‌ని ఈ గ్లింప్స్‌ తెలియజేస్తున్నది. సుధాకర్‌ చెరుకూరి ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌, రా, రియలిస్టిక్‌ టోన్‌లో అనిరుధ్‌ రవిచందర్‌ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌ని నెక్ట్స్‌ లెవల్లో నిలబెట్టాయి. రాఘవ్‌ జుయల్‌, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్‌ సాయి, నిర్మాణం: ఎస్‌ఎల్వీ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events