తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా ( తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీ శృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామనవమి వేడుకలను శనివారం ( ఏప్రిల్ 20) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురోహితుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు, పురోహితులు శాస్త్రోక్తంగా శ్రీరాముని కల్యాణం జరిపిం చారు. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులకు భద్రాచలం నుంచి తెప్పించిన వెండి నాణేలు, లడ్డూలను తాంబూలంతో పాటు అందజేశారు. ఈ కార్యక్రమంలో 1200 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా ( తాకా) అధ్యక్షుడు రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షుడు రాఘవ్ అల్లం, ప్రధాన కార్యదర్శి కుమార్ తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జునాచారి పదిరి, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు కుమారి విద్య భవణం, ఖజిల్ మొహమ్మద్, దుర్గా ఆదిత్య వర్మ భూపతిరాజు, యూత్ డైరెక్టర్ లిఖిత యార్లగడ్డ, ఎక్స్ అఫిషియా సభ్యురాలు కల్పన మోటూరి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీ బోర్డు చైర్మన్ సురేశ్ కూన, ట్రస్టీలు శృతి ఏలూరి, వాణీ జయంతి, పవన్ బాసని, ఫౌండ ర్లు హనుమంతాచారి సామంతపూడి, శ్రీనాథ్ కుందూరి మునాఫ్ అబ్దుల్ తదితరులు పాల్గన్నారు.
