Namaste NRI

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా 27-Sep-2025 ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు.

ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ గ్రూప్ బిల్డర్స్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ , వజ్ర బిల్డింగ్ వాల్యూస్ మరియు ఎవోల్వ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events