శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం స్వాగ్. హసిత్‌గోలి దర్శకత్వం. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో కింగ్, భవభూతి, సింగ, యయాతిగా నాలుగు పాత్రల్లో శ్రీవిష్ణు కనిపించాడు. పురుష ద్వేషి అయిన రాణీ రుక్మిణీ దేవిగా రీతూవర్మ కనిపించింది. టీజర్ ఆద్యంతం హాస్యప్రధానంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రానటువంటి కథ. శ్వాగణిక వంశం నేపథ్యంలో ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది అన్నారు.
వినూత్నమైన కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. తరాలుగా వస్తున్న లింగ వివక్ష అనే కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా చిత్రాన్ని తీశామని, కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే విధంగా ఉంటుందని దర్శకుడు హసిత్ గోలి అన్నారు. మీరా జాస్మి న్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, రచన-దర్శకత్వం: హసిత్‌గోలి.