Namaste NRI

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ ట్రైలర్ సక్సెస్ ప్రెస్ మీట్

వెన్నెల కిశోర్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌. అనన్య నాగళ్ల, సియా గౌతమ్‌ కీలక పాత్రధారులు. రైటర్‌ మోహన్‌ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. వంశీ నందిపాటి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ సక్సెస్‌ మీట్‌ని నిర్వహించారు.  ట్రైలర్‌ మూడు మిలియన్‌ వ్యూస్‌ని క్రాస్‌ చేయడం బిగ్‌ ఎచీవ్‌మెంట్‌ అని, కథను నమ్మి చేసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇదని, కథనం అద్భుతంగా ఉంటుందని, సినిమా పూర్తవ్వగానే పార్ట్‌ 2 ఎప్పుడని అడుగుతారని వంశీ నందిపాటి చెప్పారు. ఉత్తరాంధ్ర నేపథ్యంతో కూడిన కథ కావడంతో వెన్నెల కిశోర్‌తోపాటు ఆర్టిస్టులంతా ఆ యాసను ప్రాక్టీస్‌ చేసి నటించారు. రాజీవ్‌గాంధీ హత్య జరిగిన రోజు జరిగే కథ ఇది.

ఆయన విశాఖ పర్యటన ముగించుకుని శ్రీపెరంబదూర్‌ వెళ్లారు. అక్కడ హత్యకు గురయ్యారు. అలాంటి పెద్ద సంఘటన జరిగినప్పుడు చిన్న సంఘటనల్ని ఎవరూ పట్టించుకోరు. ఆ రోజు జరిగిన కొన్ని కల్పిత ఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇది. సినిమా అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది అని దర్శకుడు రైటర్‌ మోహన్‌ పేర్కొన్నారు. ఇంకా అనన్య నాగళ్ల, నిర్మాత వెన్నపూస రమణారెడ్డితోపాటు చిత్ర యూనిట్‌ మొత్తం మాట్లాడారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News