Namaste NRI

శ్రీకాంత్  ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో బయోపిక్స్‌ హవా నడుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త లైఫ్ స్టోరీ తెర‌పై ఆవిష్కృతం కానుంది. అదికూడా తెలుగువారు కావ‌డం విశేషం.హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా గురించి తెలిసిందే. హైదరాబాద్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో దృష్టి లోపంతో జన్మించిన శ్రీకాంత్ జీవి తంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నింటిని దీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. చివరికి హైదరాబాద్‌లో బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది.

శ్రీకాంత్ టైటిల్‌తో ఈ సినిమా రాబోతుండ‌గా, ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు హీరోగా న‌టిస్తున్నాడు. తుషార్ హీరానందానీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ త‌దిత‌ రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్రబృందం.  ఈ పోస్ట‌ర్‌లో రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర‌లో జీవించాడు అని తెలుస్తుంది. టీ సీరిస్‌, ఛాక్‌ అండ్‌ ఛీస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మార్‌ హీరానందా నీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా,  2024 మే 10న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events