Namaste NRI

సుబ్రహ్మణ్య  ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

తన తనయుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, నటుడు, ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ పి.రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సుబ్రహ్మణ్య. తిరుమలరెడ్డి, అనిల్‌ కడియాల ఈచిత్రానికి నిర్మాతలు. సోషియో ఫాంటసీ అడ్వంచర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్‌ను మేకర్స్‌ రివీల్‌ చేశారు.  అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రేక్షకులకు విజువల్‌ ఫీస్ట్‌ అందించేలా ఈ చిత్రాన్ని రవిశంకర్‌ రూపొందిస్తున్నారని, ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ముంబైలోని రెడ్‌ చిల్లీస్‌ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నది. ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లోని ప్రముఖ స్టూడియోలలో వీఎఫ్‌ఎక్స్‌, సీజీఐ పనులు జరుగుతున్నాయని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విఘ్నేష్‌ రాజ్‌, సంగీతం: రవి బస్రూర్‌, సమర్పణ: ప్రవీణ్‌ కడియాల, రామలక్ష్మి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress