ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 2023 మహాసభలు డల్లాస్‌లో ఘనంగా ముగిశాయి. బాంక్వెట్ డిన్నర్ తో నాటా కన్వెన్షన్ అట్టహాసంగా ప్రారంభం అయిన సంగతి అందరికి తెలిసిందే. రెండవ రోజు ఉదయాన్నే పూజతో ప్రారంభించి నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి అందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రసంగించారు. పండితులు నాటా నాయకులను వేద వచనాల నడుమ ఆశీర్వదించారు. నాట వ్యవస్థాపకులు డా.ప్రేమ్ సాగర్ రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా ఆదిశేషారెడ్డి, కల్చరల్ చైర్, నాటా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి దర్గా ప్రసంగించారు. డల్లాస్ నగర మేయర్ నాటా కన్వెన్షన్ సందర్భంగా పంపిన ప్రొక్లమేషన్ ని సభాముఖంగా నాగిరెడ్డి దర్గా చదవి వినిపించారు.

ఈ సందర్భంగా వివిథ థీమ్స్ తో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. సమాంతరంగా వివిధ ఎక్సిబిట్ రూమ్స్ లో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమైన వాటిలో శంకరనేత్రాలయ మీట్ అండ్ గ్రీట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవి శంకర్‌తో మీడియా ముఖాముఖీ, మిల్లెట్ మ్యాన్ పద్మశ్రీ ఖాదర్ వలి ఆహార సదస్సు, మాట్రిమోనియల్ సర్వీసెస్, నాటా ఐడల్, బ్యూటీ పేజెంట్ సెమీఫైనల్స్, ఫైనల్స్, రాంగోపాల్‌వర్మ తో ఆత్మీయ సమావేశం ఉన్నాయి. ఉమెన్స్ ఫోరమ్, సాహితీవేత్తల సమావేశాలు, వివిధ కళాశాలల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కూడా నిర్వహించారు.


డా.ప్రేమ సాగర్ రెడ్డి మరియు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవి శంకర్‌ని మెయిన్ వేదిక మీదకు తోడ్కొని వచ్చారు. రవిశంకర్ స్ట్రెస్, రిలాక్సేషన్, కాంనెస్, మైండ్ స్టెబిలిటీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలోవర్స్ ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కమిటీల సభ్యులను వేదికపై కొనిడాయరు. సినీ నటులు ఆలీ 45 సంవత్సరాల సినీ కెరీర్‌ని పూర్తి చేసిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలీ, యాని మాస్టర్ విడివిడిగా వేదికపై పాటలకు డాన్స్ చేసి అందరినీ అబ్బురపరిచారు. అలాగే సినీ నటి డా.మంజు భార్గవి, వైసీపీ నాయకులు, టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి, నాటా మాజీ అధ్యక్షులను సన్మానించారు.


మధు గొనిపాటి నాటా ఐడల్ 2023 విజేతలను ప్రకటించగా పెద్దలు బహుమతులు అందజేశారు. యాత్ర 2 సినిమా టీజర్‌ని ఆవిష్కరించారు. షాఫింగ్ స్టాల్ల్స్లో మహిళలు తమ అభిరుచుల మేరకు కలియతిరిగారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం సాయంత్రం డిన్నర్ సర్వ్ చేశారు. నాటా సభలకు హాజరైన వారందరూ వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఫోటో బూత్ ల దగ్గిర ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు. రవి మరియు వర్షిణిల యాంకరింగ్ ఆకట్టుకుంది. చివరిగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ ట్రూప్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఒక టైంలో చిన్నలు, పెద్దలు అందరూ వేదిక ముందుకు వచ్చి డాన్సులు చేశారు. అదే జోష్‌తో నాటా కన్వెన్షన్ విజయవంతంగా ముగిసింది.

