
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఉపశీర్షిక. దివ్యభారతి కథానాయిక. వేదవ్యాస్ దర్శకుడు. నేటి యువతను ఆలోచింపజేసే మంచి పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సుడిగాలి సుధీర్ కెరీర్‌లో మైలురాయిలా నిలుస్తుందని నిర్మాత తెలిపారు.ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించిందని, సందేశంతో పాటు వినోదప్రధానంగా అలరించే కథ ఇదని దర్శకుడు అన్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: మణిశర్మ, నిర్మాత: చంద్రశేఖర్ మొగుళ్ల, దర్శకత్వం: వేదవ్యాస్.















