సుధీర్‌బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం మామా మశ్చీంద్ర. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యాక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ అప్‌డేట్ అందించాడు సుధీర్ బాబు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హర్షవర్ధన్, సుధీర్ బాబు టీజర్ అనౌన్స్ మెంట్ వీడియోను లాంఛ్ చేశారు. మామా మశ్చీంద్ర టీజర్‌ను ఏప్రిల్ 14న లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఏ సమయంలో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఈ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. విడుదల తేదీపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది సుధీర్ బాబు టీం.

