హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ఉప శీర్షిక. దివ్యభారతి హీరోయిన్. ఈ చిత్రానికి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. మహతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ ఏపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింద. అయ్యోపాపం సారూ అంటూ సాగే ఈపాటకు సాహిత్యం సురేశ్ బనిశెట్టి అందించగా, లియోస్ జేమ్స్ సంగీతం సమకూర్చారు.
