Namaste NRI

సుమంత్ ప్రభాస్, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

సుమంత్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. నిధి ప్రదీప్‌ కథానాయిక.   ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సుభాష్‌చంద్ర దర్శకుడు. రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నది. పశ్చిమగోదావరి జిల్లాలోని రేలంగి, భీమవరం ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. యూత్‌ఫుల్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజీవ్‌ కనకాల, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయి సంతోష్‌, సంగీతం: నాగవంశీకృష్ణ

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress