Namaste NRI

డార్లింగ్ నుంచి సున్ చలియా సాంగ్ రిలీజ్

ప్రియదర్శి, నభా నటేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం డార్లింగ్‌. అశ్విన్‌ కె రామ్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మూడో గీతం సునో చెలియా విడుదలైంది. వివేక్‌సాగర్‌ స్వరపరచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్‌ రాయగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. మనసంటూ ఒకటుందని లోపల తోచిందే తొలిసారే, కనులొచ్చి తిరిగిందే నా కల నీ వల్లే ఓ ప్రేమ.. మారిపోయే నా లోకమే..నిన్న లేదే ఇంతందమే  అంటూ ప్రేమికుల భావాలకు అద్దం పడుతూ చక్కటి మెలోడీతో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉందని, ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని చిత్ర బృందం పేర్కొంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్‌, సంభాషణలు: హేమంత్‌, రచన-దర్శకత్వం: అశ్విన్‌రామ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events