వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం సౌండ్ పార్టీ. సంజయ్ శేరీ దర్శకుడు. రవి పోలిశెట్టి నిర్మాత. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం. నిర్మాత మాట్లాడుతూ కథ, కథనాలను నమ్మి రూపొందిస్తున్న చిత్రమిది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విభిన్నమైన సినిమాలను నిర్మించడమే మా సంస్థ లక్ష్యం. కేవలం 25 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేశాం. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. సన్నీ మాట్లాడుతూ నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ విడుదల చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. కథకు తగ్గ టైటిల్ ఇది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.
ఈ చిత్రంలో శివన్నారాయణ , అలీ, సప్తగిరి, థర్టీఇయర్స్ పృథ్వి, మిర్చి్ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరికిరణ్, జెమినిణ సురేష్, భువన్ సాలూరు, ఐ డ్రీమ్` ణ అంజలి, ఇంటూరివాసు, చలాకిచంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణతేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ బీ సంగీతం: మోహిత్ రెహమానిక్ బీ పాటలు : పూర్ణచారిబీ పి. ఆర్. ఓ. : జికె మీడియా బీ లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ బీ ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు బీ నిర్మాత : రవి పోలిశెట్టిబీ సమర్పణ : వి.జయశంకర్ బీ రచన ఉ దర్శకత్వం : సంజయ్ శేరి.