సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెండ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. వాలెంటన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. సినిమాలో కీర్తి సురేష్ పాత్ర కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు. మహేష్‌బాబుని సరికొత్త అవతారంలో ఆవిష్కరించే చిత్రమిది. యాక్షన్‌తో కూడిన కుటుంబ వినోద చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పరశురామ్.
ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. ఈచిత్రానికి ఛాయాగ్రహణం : ఆర్. మధి, కూర్పు: మార్తాండ్ కె.వేంకటేష్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్














