Skip to main content

Namaste NRI

వాలంటైన్స్ డేకు సర్కారి వారి పాట నుంచి సర్ ప్రైజ్

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెండ్‌ డైరెక్టర్‌ పరుశురామ్‌  తెరకెక్కిస్తున్నారు. వాలెంటన్స్‌ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. సినిమాలో కీర్తి సురేష్‌ పాత్ర కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్‌ సింగిల్‌ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.  ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. తమన్‌ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు.  మహేష్‌బాబుని సరికొత్త అవతారంలో ఆవిష్కరించే చిత్రమిది. యాక్షన్‌తో కూడిన కుటుంబ వినోద చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పరశురామ్‌.

ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. ఈ చిత్రం మే 12న రిలీజ్‌ కానుంది.   ఈచిత్రానికి ఛాయాగ్రహణం : ఆర్‌. మధి, కూర్పు: మార్తాండ్‌ కె.వేంకటేష్‌, కళ: ఎ.ఎస్‌. ప్రకాశ్‌

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events