Namaste NRI

సూర్య, వెంకీ అట్లూరి సినిమా ప్రారంభం

అగ్ర నటుడు సూర్య  46వ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టిన సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. వేడుక, భావోద్వేగం మరియు వినోదం వైపు తొలి అడుగు అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ను జత చేసింది. లక్కీ భాస్కర్‌ తరహాలోనే బలమైన భావోద్వేగాలు, హ్యూమన్‌ డ్రామా కలబోసిన కథాంశమిదని, వైవిధ్యానికి చిరునామాగా అభివర్ణించే సూర్య కెరీర్‌లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని మేకర్స్‌ తెలిపారు.

ఇందులో మమితాబైజు నాయికగా నటిస్తుండగా, రాధికా శతర్‌కుమార్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్‌ రవి, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌నూలి, ఆర్ట్‌: బంగ్లాన్‌, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Social Share Spread Message

Latest News