Namaste NRI

సూర్య కంగువ టీజర్‌ను విడుదల

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ ఫాంటసీ చిత్రం కంగువ. దిశా పటానీ కథానాయిక.  శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్య పుట్టిన రోజును పురస్కరించుకొని టీజర్‌ను విడుదల చేశారు. అడవి నేపథ్యంలో చారిత్రక, ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సూర్య అరణ్య వీరుడి పాత్రలో కనిపించనున్నారు.  టీజర్‌ ఆసాంతం సూర్య పరాక్రమాలను ఆవిష్కరిస్తూ మాస్‌ అంశాలతో సాగింది. దేవిశ్రీప్రసాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్‌గా నిలిచింది. అడవి నేపథ్యంలో అబ్బురపరిచే విజువల్స్‌తో సినిమా సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర బృందం పేర్కొంది. దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూర్య కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న చిత్రమిది కావడం విశేషం. పాన్‌ ఇండియా మూవీగా పది భాషల్లో విడుదలకానుంది.    వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events