సూర్య హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ కంగువ. శివ దర్శకుడు. స్టూడియోగ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తు న్నారు. ట్రైలర్‌ను విడుదల చేశారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ రహస్య దీవిలో రెండు గిరిజన తెగల మధ్య జరిగిన పోరాటం ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ ద్వారా అర్థమవుతున్నది. యుద్ధపిపాసిగా ప్రతినాయకుడు బాబీ డియోల్ కనిపించగా, తనవారిని రక్షించుకోవడానికి తానే ఒక సైన్యంగా మారే యుద్ధవీరుడు కంగువ పాత్రలో సూర్య కనిపించారు.
భారీ ఓడలపై జరిగే యుద్ధ ఘట్టాలు, విజువల్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయి. బాబీ డియోల్, సూర్య పాత్రలు సమవుజ్జీల సమరాన్ని తలపించాయి. దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, రచన-దర్శకత్వం: శివ.