విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఫీనిక్స్. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌తో పాటు హై ఎమోషన్స్‌తో ఉండబోతుంది. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి అన్ల్ అరసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు.

ఇందులో యాక్షన్ సీన్స్ ఓ స్థాయిలో ఉంటాయని, అందుకే ఏడాదిన్నరపాటు శిక్షణ తీసుకొని నటించానని సూర్య సేతుపతి తెలిపారు. సూర్యకి గొప్ప భవిష్యత్ ఉంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది అని దర్శకుడు అనల్ అరుసు తెలిపారు. ఇంకా కథానాయిక వర్ష, రైటర్ భష్యశ్రీ, నిర్మాతలు ధనుంజయన్, రాజ్యలక్ష్మీ కూడా మాట్లాడారు. త్వరలో సినిమా విడుదల కానుంది.















