ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన రియలిస్టిక్ లవ్‌స్టోరీ సూర్యాపేట్ జంక్షన్. అభిమన్యుసింగ్ కీలకపాత్ర పోషించారు. రాజేష్ నాదెండ్ల దర్శకుడు. అనీల్‌కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాసరావు నిర్మాతలు. ప్రచార చిత్రాలవల్ల సినిమాపై అంచనాలు పెరిగాయని, మంచి కథతో రూపొందిన ఈ చిత్రం తప్పక ప్రేక్షకులకు నచ్చుతుందని హీరో ఈశ్వర్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇందులో యాక్షన్ సీన్స్ సహజంగా ఉంటాయని, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని నిర్మాత అనిల్‌కుమార్ కాట్రగడ్డ తెలిపారు.

ఈ నెల 25న గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెండు తెలుగు రాష్ర్టాల్లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ: ఈశ్వర్, మాటలు: సత్య, రాజేంద్ర భరద్వాజ్, కెమెరా: అరుణ్‌ప్రసాద్, సంగీతం: రోషన్ సాలూరి, గౌరహరి, నిర్మాణం: యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్.
