సూర్య హీరో గా నటించిన చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. సూర్య సరసన త్రిష నటిస్తోంది. నేడు సూర్య పుట్టినరోజును పురస్కరించుకొని కరుప్పు టీజర్ ను రిలీజ్ చేశారు. అదే టీజర్ ను టైటిల్ మార్చకుండానే తెలుగులో కూడా రిలీజ్ చేశారు.

కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు, మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగొచ్చే దేవుడు అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ మాస్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంది. సూర్య భిన్న పార్శాలు కలిగిన పాత్రలో కనిపించారు. కంప్లీట్ మాస్ అవతార్‌లో ఆయన అభిమానుల్ని మెప్పించేలా ఉన్నారు. ఇంద్రన్స్, నట్టి, స్వసిక తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, రచన-దర్శకత్వం: ఆర్జే బాలాజీ.
















