అమెరికాలో ఉన్న భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేరళకు చెందిన 42 ఏళ్ల ఆనంద్ సుజిత్ హెన్రీ, 40 ఏళ్ల అలిస్ ప్రియాంకా, వారి ఇద్దరు కవలలు నోహ, నైతాన్ కాలిఫోర్నియాలోని అపార్ట్‌మెంట్‌లో మృతిచెందారు. ఆ కుటుంబానికి చెందిన బంధువు ఈ సమాచారాన్ని పోలీసులకు అంద జేశారు. బాత్రూమ్‌లో పడి ఉన్న ఆనంద్, అలిస్ జంటకు తూటా గాయాలు ఉన్నాయి. ఇద్దరు పిల్లల మృత దేహాలను బెడ్‌రూమ్‌లో గుర్తించారు. అయితే ఏ కారణంగా వాళ్లు చనిపోయారన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ ఇంట్లో నుంచి 9ఎంఎం పిస్తోల్‌ను, లోడ్ చేసిన మ్యాగ్జిన్‌ను రికవరీ చేశారు. బాత్రూమ్ నుంచి వాటిని సీజ్ చేశారు.
కేరళకు చెందిన ఆ కుటుంబం దాదాపు 9 ఏళ్ల నుంచి అమెరికాలోనే నివసిస్తున్నది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఆనంద్, సీనియర్ అనలిస్టుగా అలిస్ పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం న్యూజెర్సీ నుంచి సాన్ మాటియో కౌంటీ కి వాళ్లు వలసవచ్చారు. వాళ్లకు స్నేహపూర్వకమైన వ్యక్తులుగా గుర్తింపు ఉన్నది. 2020లోనే ఆ జంట ఇళ్లను 2 మిలియన్ల డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. మర్డర్-సూసైడ్ లాగా ఈ ఘటన కనిపిస్తున్నట్లు పోలీసులు అను మానిస్తున్నారు2016లో విడాకులు కోసం ఆనంద్ దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది.