భారత గణతంత్ర దిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత విద్యార్థులకు తీపి కబురు అందించారు. 2030 నాటికి ఫ్రాన్స్‌లో 30 వేల మంది భారత విద్యార్థులు చదవాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇది ఉన్నతమైన లక్ష్యం, కానీ దీన్ని సాకారం చేయాలని నేను నిర్ణయించుకున్నాను అని పేర్కొన్నారు. తమ దేశ విశ్వవిద్యాల యాల్లో చదువుకొనే ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం అంతర్జాతీయ తరగతులు నిర్వహిస్తా మన్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీల నెట్‌వర్క్ అభి వృద్ధి చేస్తామన్నారు. మా దేశంలో చదువుకున్న మాజీ భారత విద్యార్థులకు వీసా మంజూరు చేయడాన్ని సులభతరం చేస్తాం అని మాక్రాన్ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని ఈ సందర్భంగా మాక్రాన్ వెల్లడించారు. 2025నాటికి 20 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్‌కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
