Namaste NRI

బోస్టన్ లో టిఎజిబి ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (టిఎజిబి) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న స్థానిక లిటిల్‌టన్ హైస్కూల్‌లో దసరా–దీపావళి ధమాకా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బోస్టన్‌లో తొలి భారతీయ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన ఎస్. రఘురాంను టీఏజీబీ (టిఎజిబి) సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంగీతం, నృత్యం, వినోదం సమ్మిళితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సాంస్కృతిక విభాగం సక్రమంగా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి.

ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతులపై మమకారం ఉన్న ఎస్. రఘురాం బోస్టన్‌లో భారతదేశ ప్రతినిధిగా నియమితులవడం తెలుగు వారికి గౌరవకారణమని వ్యాఖ్యానించారు. ఇక సమాజ సేవలో ముందుండే పలువురు ప్రముఖులను కూడా టీఏజీబీ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగంగా ఘనంగా సన్మానించారు. తమ సేవలతో కమ్యూనిటీకి ఆదర్శంగా నిలిచిన టీం ఐడ్ వ్యవస్థాపకులు మోహన్ నన్నపనేని, బోస్టన్ ప్రాంత ప్రముఖులు, సమాజసేవకులు రమేష్ బాపనపల్లిని కూడా ఈ సందర్భంగా సత్కరించారు.

ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది నాయకత్వంలో, ప్రెసిడెంట్ ఎలక్ట్ సుధా ముల్పూర్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కొశాధికారి జగదీశ్ చిన్నం, కల్చరల్ సెక్రెటరీ సుర్య తెలప్రోలు సమన్వయంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సుధ ముల్పుర్‌, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కోశాధికారి జగదీశ్‌ చిన్నం, కల్చరల్‌ సెక్రటరీ సూర్య తెలప్రోలు, సభ్యులు శేషగిరిరెడ్డి, పద్మావతి భిమ్మన, కాళిదాస్‌ సూరపనేని, ఎక్స్‌ అఫీషియా మెంబర్‌ దీప్తి గోరా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events