Namaste NRI

రణరంగంగా తైవాన్‌ పార్లమెంట్‌

తైవాన్ పార్లమెంట్  రణరంగాన్ని తలపించింది. సభలో ఎంపీలు తన్నుకున్నారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకూ వాదోపవాదాలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. మధ్యాహ్నం తర్వాత కొంత మేర సద్దుమణిగినా తిరిగి మళ్లీ అదే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించే చట్ట సభ్యులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎంపీలు స్పీకర్‌ చుట్టూ చేరి గందరగోళం సృష్టించారు. టేబుళ్లపైకి ఎక్కి దూకండం, సహచర సభ్యులను బెంచలపై నుంచి కిందకు తోసేయడం వంటి ఘటనలతో సభ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఓ ఎంపీ ఫైళ్లు లాక్కొని పార్లమెంట్‌ నుంచి బయటకు పరుగులు తీశాడు. శాసనసభ మెజారిటీ లేకున్నా అధ్యక్షుడిగా ఎన్నికైన చింగ్ తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events