అప్సర రాణి ప్రధాన పాత్రలో నగేష్ నారదాసి తెరకెక్కిస్తున్న చిత్రం తలకోన. విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అశోక్ కుమార్, అజయ్ ఘోష్, సుభాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా మరో నిర్మాత రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిది. కథ విషయానికొస్తే తలకోన అడవిలోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. అయితే వాళ్లలో ఎంతమంది తిరిగి వచ్చారు అన్నది చిత్ర కథాంశం అన్నారు. నటి అప్పర రాణి మాట్లాడుతూ మంచి స్క్రిప్ట్‌కు నేను అభమానిని. అదే ఇప్పుడు ఈ చిత్రం చేయడానికి కారణమైంది. ఈ సినిమా మంచి విజయంతో పాటు చక్కటి పేరును తీసుకొస్తుందని ఆశిస్తున్నా అంది. ఈ కార్యక్రమంలో డి.శ్రీధర్, సుభాష్, హీరోయిన్ అప్పర రాణి, రాహుల్ యాదవ్ నక్కా, వేగేశ్న సతీష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.














