Namaste NRI

తమన్నా బర్త్ డే స్పెషల్.. ఓదెల 2 నుంచి కొత్త పోస్టర్

తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రెస్టేజియస్‌ థ్రిల్లర్‌ ఓదెల 2. ఈ చిత్రానికి అశోక్‌ తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. ఇందులో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నాగసాధు అవతారంలో ఉన్న తమన్నా తాజా పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్లో పుర్రెలపై ధైర్యంగా నడుస్తున్న తమన్నాను చూడొచ్చు. ఆకాశంలో ఎగురుతున్న రాబందులు ఈ పోస్టర్‌లో ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలో తమన్నాపై భారీ పోరాట సన్నివేశాలు కూడా ఉంటాయని, వాటికోసం ఆమె ప్రాపర్‌గా ట్రైనింగ్‌ కూడా తీసుకున్నదని, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వనున్నదని మేకర్స్‌ తెలిపారు. హెబ్బాపటేల్‌, వశిష్ట ఎన్‌.సింహ, యువ, నాగమహేశ్‌, వంశీ, గగనవిహారి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్‌.ఎస్‌, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సమర్పణ: సంపత్‌నంది, నిర్మాణం: మధు క్రియేషన్స్‌, సంపత్‌నంది టీమ్‌వర్క్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress