ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు, రోటరీ క్లబ్ ఆఫ్ శింగరకొండ, అద్దంకి ఆద్వర్యంలో, కూకట్ల ఫౌండేషన్ అధినేత, తానా ఈవెంట్స్ కోఆర్డినటర్ శ్రీనివాస్ కూకట్ల తిమ్మాయపాలెం హైస్కూల్ లో విద్య అభ్యసిస్తున్న 45 మంది విధ్యార్దినులకు సైకిల్ లు అందించారు. ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సందిరెడ్డి శ్రీనివాస్ ఆద్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారికి, ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ గారికి, మరియు దాత శ్రీనివాస్ కూకట్ల గారికి ధన్యవాదాలు తెలిపారు.