ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తానా రైతు సదస్సు పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు, టి.పిసిసి అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, విజయ డైరీ కార్పొరేషన్‌కు చెందిన డా. చలసాని ఆంజనేయులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్ డా. ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, అగ్రికల్చరిస్ట్, మూవీ ఆర్టిస్ట్ నాగినీడు వెల్లంకి గెస్ట్ స్పీకర్‌గా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం సందర్శించండి.


