Namaste NRI

పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ లో ఘనంగా తానా (TANA) మిడ్ అట్లాంటిక్ ఉగాది వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం వారు పరాభవ నామ సంవత్సరపు ఉగాది వేడుకలను పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హైస్కూల్ లో వైభవంగా నిర్వహించి తెలుగువారి వైభవాన్ని మరోసారి చాటిచెప్పారు. ఈ వేడుకలను తిలకించేందుకు దాదాపు 1800 మందికిపైగా తెలుగువాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చారు.

తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, మరియు సతీష్ తుమ్మల మార్గదర్శకత్వంలో తానా మిడ్ అట్లాంటిక్ బృందం ఈ ఉగాది వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

ఈ ఉగాది వేడుకలు మధ్యాహ్నం 3.45 నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత ప్రార్థనతో కార్యక్రమాలను ప్రారంభించారు. సంప్రదాయమైన ఉగాది పంచాంగ శ్రవణం వచ్చినవారిని ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భాగంగా వచ్చినవారికి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.

స్థానిక కళాకారుల నత్య ప్రదర్శనలు, ఇండియన్ ఐడల్ స్టార్ అనిరుధ్ సుస్వరం సంగీత విభావరి ఆకట్టుకుంది. తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కె.పి. సోంపల్లి ఈ వేడుకల్లో చేసిన పౌరాణిక ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది.

ఈ వేడుకలకు ఎలైట్ స్పాన్సర్లుగా డాక్టర్ నాయుడు మరియు డాక్టర్ ప్రమీల మోటుపల్లి, తిరుమల్ మునుకుంట్ల, సుబ్రహ్మణ్యం ఒసూరు, రామకృష్ణ తాడిసెట్టి, ప్రీమియర్ మరియు ప్లాటినం స్పాన్సర్లు, స్టాల్స్ నిర్వాహకులు, యూత్ వాలంటీర్లు, మరియు నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొన్న తానా మిడ్ అట్లాంటిక్ గర్ల్స్ క్లబ్ కు నిర్వాహకులు విశేష కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ వేడుకకు గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించి పండుగ శోభను పెంచిన తెలంగాణ స్పైసెస్ కిచెన్ కు నిర్వాహకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్వేత కొమ్మోజి వ్యవహరించి తన వాక్చాతుర్యంతో,హుందాతనంతో వేడుకను ఆకట్టుకునేలా చేశారు.

ఈ సందర్భంగా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన కళాకారులకు, వాలంటీర్లకు, స్పాన్సర్లకు, గౌరవనీయులైన అతిథులకు, కమ్యూనిటీ సభ్యులకు, పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ నరెపాలేపు, మరియు న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వారిని తానా మిడ్ అట్లాంటిక్ బృందం ఘనంగా సత్కరించింది.ఈ ఉగాది కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ వారు ఏర్పాటు చేసిన చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలను అందజేశారు.

అదనంగా, ఉగాది వేడుకల స్ఫూర్తిని మరియు అద్భుతమైన క్షణాలను అద్భుతంగా చిత్రీకరించిన శ్రీ అరవింద్ నాగిళ్ల , హిరాక్లిక్స్ ఫోటోగ్రఫీకి తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events