Namaste NRI

హెచ్‌-1బీ ఉద్యోగులను నియమించుకోం : టీసీఎస్‌

టీసీఎస్‌ అమెరికాలో తమ ఉద్యోగుల నియామక వ్యూహంపై స్పష్టతను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్‌-1బీ వీసాదారులను అక్కడ ఉద్యోగులుగా నియమించుకోమని ఆ కంపెనీ సీఈవో కృతివాసన్‌ తెలిపారు. స్థానిక ప్రతిభావంతుల నియామకంపై టీసీఎస్‌ దృష్టి పెడుతుంది. ప్రస్తుతం అమెరికాలోని సుమారు 33 వేల టీసీఎస్‌ ఉద్యోగుల్లో సుమారు 11 వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు ఉన్నారు. హెచ్‌-1బీ వీసా కలిగిన ఉద్యోగులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నట్టు కృతివాసన్‌ తెలిపారు. ఉద్యోగుల కోసం ఎల్‌-1వీసాల సదుపాయం ఉన్నప్పటికీ అవి హెచ్‌-1బీని పూర్తిగా భర్తీ చేయలేవని ఆయన చెప్పారు. ఐటీ సేవలకు డిమాండ్‌ తక్కువగా ఉండటం, ైక్లెంట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉన్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Social Share Spread Message

Latest News