టీ 20 వరల్డ్ కప్ 2024 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి. ఈ వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు న్యూయార్క్ చేరుకుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముగియడంతో ఫైనల్ ఆడే భారత క్రికెటర్లు తప్ప మిగిలినవాళ్లంతా మే 25 శనివారమే అమెరికా ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా వీరు న్యూయార్క్‌లో ల్యాండ్ అయ్యారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్‌లు న్యూయార్క్ చేరుకున్నారు.