రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేద్రనాథ్, శ్రీచరణ్, అశోక్ ప్రధాన పాత్రలు పోషించిన తెలంగాణ గ్రామీణ నేపథ్య చిత్రం కలివి వనం. రాజ్ నరేంద్ర దర్శకుడు. మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. గురువారం టీజర్‌ని విడుదల చేశారు.

వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే, ఆకాశం నుంచి అని కాకుండా, చెట్ల వల్లే వర్షం వస్తుందని చెప్పాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచీ అందరికీ అర్థమవుతుంది. ఈ నీతిని తెలియజేసేలా, వన సంరక్షణ అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది అని దర్శకుడు రాజ్ నరేంద్ర చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మదీన్ ఎస్కే, పాటలు: కాసర్ల శ్యామ్, మట్లా తిరుపతి, కమల్ ఇస్లవంత్.
