Namaste NRI

సూపర్ యోధగా తేజ సజ్జ..టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

హను-మాన్‌ తో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు యువకథానాయకుడు తేజ సజ్జా. తాజాగా కొత్త సినిమా ప్రకటన వెలువడింది.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించనున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. ఈ సినిమాకు చెందిన పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. పోస్టర్‌లో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీతో బ్యాక్‌ పోజ్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో స్టైలిష్   మేక్‌ ఓవర్‌తో సూపర్‌యోధగా కనిపిస్తున్నాడు. ఈ నెల 18న ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్టు మేకర్స్‌ తెలిపారు. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ కథాంశంతో, సాహసోపేత వీరగాధగా ఈ సినిమా ఉండనుందని దర్శకుడు తెలిపా రు. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నదని, ఈ నెల 18న సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు కూడా వెల్లడిస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి రచన: మణిబాబు కరణం, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress