తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA), అమెరిక లో మొదటి జాతీయ తెలంగాణ సంస్థ గ్రేటర్ ఫిలడెల్ఫియా లో శనివారం, మే 20, తేదీన సమావేశమైంది. TTA బోర్డు సమావేశానికి ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి ప్రారంభోపన్యాసం లో మాట్లాడుతూ సంస్థ ప్రారంభించిన సమయంలో ఉన్న ఇబ్బందులను సాధించిన విజయాలను ఇకపై సంస్థ నిర్దేశించుకోవలసిన లక్ష్యాలను తోటి సభ్యులతో పంచుకున్నారు .ఈకార్యక్రమంలోనే నూతన సలహా మండలి అధ్యక్షుడిగా డాక్టర్ విజయపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మాదాడి భరత్ TTA సలహా మండలి సభ్యునిగా నియమితులయ్యారు. అడ్వైజరీ చైర్ విజయపాల్ రెడ్డి రాబోయే 2 సంవత్సరాల పాటు TTA విజయవంతానికి చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను తెలియజేసారు.
పైళ్ల మల్లా రెడ్డి TTA సభ్యులందరూ డిసెంబర్ 2023లో జరగబోయే TTA సేవా దినాలలో పాల్గొనవలసిందిగా అభ్యర్థించారు మరియు TTA సేవా రోజుల 2023 కమిటీని ఏర్పాటు చేసారు.ప్రెసిడెంట్ వంశీ రెడ్డి బోర్డు మీటింగ్‌కి హాజరైనందుకు బోర్డ్ మరియు TTA టీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు మరియు ప్రెసిడెంట్‌గా తాను 90 రోజులలో USA అంతటా నిర్వహించిన అన్ని కార్యక్రమాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు.అనంతరం కొత్త సభ్యులను చేర్చుకున్న టీటీఏ చాప్టర్‌లందరికీ, సభ్యత్వాలు పొందడంలో విశేష కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. TTA మెగా కన్వెన్షన్ 2024 సియాటిల్‌లో చేయనున్నట్టు ప్రకటించారు.
TTA సేవా డేస్ సలహాదారులుగా నవీన్ మల్లిపెద్ది,జ్యోతి రెడ్డి,సేవా డేస్ కోఆర్డినేటర్లు గా సురేష్ రెడ్డి ,కో-ఆర్డినేటర్ గా దుర్గాప్రసాద్ ఎన్నుకోబడ్డారు. కొత్తగా ఎన్నికైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డాక్టర్ మోహన్ రెడ్డి అడ్వైజరీ కో-చైర్ చే ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన నవీన్ మల్లిపెద్ది మరియు అందరు EC సభ్యులు సియాటెల్‌లో TTA మెగా కన్వెన్షన్ 2024 నిర్వహణపై తమ అభిప్రాయాలను మరియు వారి ప్రణాళికలను తెలియజేశారు.AC, EC, BOD’S RVPలు మరియు SC లు బోర్డ్ మీటింగ్‌ని మరియు వారి ఆతిథ్యాన్ని నిర్వహించినందుకు గ్రేటర్ ఫిలడెల్ఫియా TTA బృందానికి కృతజ్ఞతలు తెలిపారు మరియు బోర్డ్ మీటింగ్ యొక్క స్పాన్సర్‌లందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక గ్రేటర్ ఫిల్డెల్ఫియా టీటీఏ బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు టీటీఏ బృందం హాజరయ్యారు.