Namaste NRI

స్విట్జర్లాండ్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

 స్విట్జర్లాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుచేసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల కేక్ కట్‌చేసి తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నారు.  ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌  స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ గందె మాట్లాడుతూ కేసీఆర్ పట్టుదల, దీక్ష కారణంగానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. సాధించిన రాష్ట్రాన్ని గత తొమ్మిదేండ్లుగా ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న తీరును వివరించారు.

 హరిత హారం స్ఫూర్తితో ఆరుబయట చెట్ల మధ్యన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పెషల్‌ దమ్ బిర్యానీని అందరూ ఆస్వాదించారు.  ఈ కార్యక్రమంలో పవన్ దుద్దిళ్ల, రాజేందర్, యువరాజ్, నాగరాజ్, ప్రవీణ్, రాజశేఖర్, అనిల్ రెడ్డి, దశరథ్, వినోద్, పద్మజ రెడ్డి, కిషోర్, అల్లు కృష్ణ, అనిల్ జాల, విజయ్, ప్రశాంత్  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events